జిల్లాలో నమోదైన స్క్రబ్ టైపస్ కేస్

జిల్లాలో నమోదైన  స్క్రబ్ టైపస్ కేస్

GNTR: పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామంలో స్క్రబ్ టైపస్ వైరస్ కలకలం రేపుతుంది. ఈనెల 3న ఓ వ్యక్తి విరోచనాలు అవుతున్నాయని వెనిగండ్లలో ఉన్న పీహెచ్సీలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. దీంతో అన్ని పరీక్షలు చేసి 6వ తేదీనా స్క్రబ్ టైపస్ వైరస్ సోకిందని సోమవారం అధికారులు వెల్లడించారు.