మండల ప్రధాన కార్యదర్శిగా జె. జగదీశ్ బాబు

CTR: జీడీనెల్లూరు వైసీపీ మండల ప్రధాన కార్యదర్శిగా జె. జగదీశ్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, కృపాలక్ష్మి, వైస్ ఎంపీపీ హరిబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.