యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన.. కలెక్టర్

యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన.. కలెక్టర్

MHBD: కంబాలపల్లి గ్రామంలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించారు. యూరియా పంపిణీ పారదర్శకంగా జరగాలని, ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో, రిజిస్టర్‌లో నమోదు చేసి అమ్మకాలు కొనసాగించాలని, బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరిగితే చర్యలు తీసుకుంటామని సూచించారు.