బీసీ రాజారెడ్డి ఆహ్వానించిన ఆర్యవైశ్య సోదరులు
NDL: బనగానపల్లె పట్టణంలో మంత్రి సోదరుడు మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డిని ఆదివారం ఆర్యవైశ్య సోదరులు దసరా ఉత్సవాలకు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దసరా ఉత్సవాలకు హాజరుకావాలని బీసీ రాజారెడ్డిని వారు కోరారు. అనంతరం దసరా ఉత్సవాలు జరిగే ఆహ్వాన పత్రికను రాజారెడ్డికి అందజేశారు.