ఓటర్ ఫెసిలిటీషియన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

KMR: ఆర్టీఓ కార్యాలయంలోని ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదివారం సందర్శించారు. పోలింగ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 8 వరకు ఈ కేంద్రం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రఘునాథ్ రావు, తహశీల్దార్ జనార్ధన్, అధికారులు పాల్గొన్నారు.