గుడి నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం

గుడి నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం

వనపర్తి మండలం పెద్దగూడెంలో అసంపూర్తిగా ఆగిపోయిన పోచమ్మ గుడి పునర్నిర్మాణం కోసం గ్రామ యాదవ గోపాలకృష్ణ సంఘం సభ్యులు ముందుకు వచ్చారు. యాదవులు తమ సంఘం తరపున గుడి నిర్మాణ నిమిత్తం గ్రామ పెద్దలకు రూ.2 లక్షల నగదును సోమవారం అందజేశారు. వారి సహకారాన్ని గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.