VIDEO: నల్ల పోచమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ 7 వారాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బోరంచ నల్ల పోచమ్మకు ఖేడ్ ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఆలయ ఛైర్మన్ మల్లయ్య, ప్రధానార్చకులు శ్రీకాంత్ స్వామి ఆధ్వర్యంలో పూజారులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి పూజలు చేసి దర్శించుకున్నారు.