మాదాపూర్ పార్కులో పనిచేయని వీధిలైట్లు..!

HYD: మాదాపూర్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కావూరి హిల్స్ పార్క్ 2లో దాదాపు 9 లైట్లు పనిచేయటం లేదన్నారు. దీంతో సాయంత్రం సమయంలో వాకింగ్ చేసేవారు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేశారు. సాధ్యమైనంత త్వరగా స్పందించి లైట్ల మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని కోరారు.