తంబళ్లపల్లెలో ఒడిశా యువకుడు ఆత్మహత్య
అన్నమయ్య: ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన మనోజ్ బిషోయ్ (30) అనే యువకుడు మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తంబళ్లపల్లి మండలం నాయనప్పగారిపల్లెలో నూనె మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్న మనోజ్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.