VIDEO: పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించాలి: కలెక్టర్
WNP: ప్రభుత్వ విద్యా సంస్థలో చదివే విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం పెబ్బేరు మండలంలోని కస్తూర్బా బాలిక విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి మార్కులు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.