భారీ ధరకు 'స్వయంభు' ఓవర్సీస్ రైట్స్!
హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న మూవీ 'స్వయంభు'. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'ఫార్స్ ఫిల్మ్స్' వారు రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇది నిఖిల్ కెరీర్‌లోనే అత్యధికమని తెలిపాయి. ఇక ఈ మూవీలో సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.