కేతేపల్లి: మూసి ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 644.60 అడుగులు (4.35 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. మూసీ ప్రాజెక్టులోకి మంగళవారం ఎగువ నుంచి 381.82 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతున్నందున ప్రాజెక్టు నంబర్-3 గేట్ పైకెత్తి 151.96 క్యూసెక్కులు, తాగునీటి కోసం 11.15 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.