తగ్గేదే లే.. చమురు ట్యాంకర్లపై కేంద్రం క్లారిటీ

తగ్గేదే లే.. చమురు ట్యాంకర్లపై కేంద్రం క్లారిటీ

విదేశీ చమురు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని చాటింది. 'మున్ముందు మరిన్ని ట్యాంకర్లు రానున్నాయి, చమురు కొనుగోలు నిరంతరం కొనసాగుతుంది' అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. రష్యా సహా వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని, భారతీయుల ఇంధన భద్రతే తమకు అత్యున్నత ప్రాధాన్యత అని వెల్లడించారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామన్నారు.