VIDEO: బాధితుడికి నష్టపరిహార ప్రొసీడింగ్ కాపీ అందజేత
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్ పల్లి అటవీ ప్రాంతంలో 4 రోజుల క్రితం ఓ పులి కుచాడి శ్రావణ్ రావుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపింది. ఈ సందర్బంగా బాధితుడు కుచాడి శ్రావణ్ రావుకు మంజూరైన రూ.25 వేల నష్టపరిహార ప్రొసీడింగ్ కాపీని FRO లక్ష్మీనారాయణ అందజేశారు. అటవీ ప్రాంతంలో పులి తిరుగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.