VIDEO: హరహర మహాదేవ్ నినాదాలతో మండపానికి శివపార్వతులు
PDPL: ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం శివపార్వతుల విగ్రహాలను ఘనంగా మండపానికి తీసుకెళ్లారు. భక్తులు హరహర మహాదేవ్ నినాదాలతో ఊరేగింపుగా స్వామివారిని మండపానికి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు.