ఎస్పీ రావుల గిరిధర్‌ను సత్కరించిన కలెక్టర్
WNP: జిల్లా నుంచి బదిలీ నేపథ్యంలో ఎస్పీ రావుల గిరిధర్ సేవలను స్మరించుకుంటూ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని, ఎస్పీని శాలువాతో సత్కరించారు. వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల బలోపేతానికి, ఆయన అందించిన సేవలకు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.