గ్రామస్థుల నరకయాతన.. రహదారే మురుగు కాలువ
NTR: వీరులపాడు మండలంలో దొడ్డదేవరపాడులో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రహదారులపైనే ప్రవహిస్తోంది. దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాల బారిన పడుతున్నామని, అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.