జిల్లాలో బాలుడు దారుణ హత్య
కృష్ణా జిల్లా నందివాడ మండలం పెదలింగాలలో దారుణం చోటుచేసుకుంది. నానమ్మతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న పదేళ్ల బాలుడు బాలాజీపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ క్రమంలో నానమ్మ లక్ష్మి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషయంగా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.