ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ ఉగ్రవాది హతం

ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాక్ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో భారత ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు కలిసి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఘటనా స్థలంలో ఏకే రైఫిల్, పిస్టల్స్, భారీగా మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.