నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

సిద్దిపేట: విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా సిద్దిపేట గ్రామీణ మండలంలోని ఇర్కోడ్ గ్రామంలో మంగళవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడిఈ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. రైతులు, వినియోగదారులు గమనించి విద్యుత్తు శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.