పాలకుర్తిలో అందెశ్రీకి ఘన నివాళులు
JN: పాలకుర్తి మండల కేంద్రంలోనీ రాజీవ్ చౌరస్తాలో సామాజిక ఉద్యమకారుడు కొనుకటి కళింగరాజు ఆధ్వర్యంలో అందెశ్రీకి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అందెశ్రీ ఆశయ సాధన కోసం ఆయన అందించిన స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక ఉద్యమాలు పెంపొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గడ్డం యాక సోమయ్య, సాంబయ్య, చెరుపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.