రావులపాలెంలో SIR పై అవగాహన
కోనసీమ: రావులపాలెంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆద్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే, SIR రాష్ట్ర కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ SIR గురించి వివరించారు. జిల్లాలో అధికారులకు నాయకులు సహకరించాలని కోరారు.