ఆడపిల్లలు బాల్య వివాహాలకు బలికాకూడదు: ఎంపీ
MBNR: జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇవాళ నిర్వహించిన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొని, ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు బాల్య వివాహాలకు బలికాకూడదనే ప్రధాని మోదీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరవేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎంపీ తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.