రేపు శ్రీ కూర్మనాధ క్షేత్రంలో తెప్పోత్సవ కార్యక్రమం

రేపు శ్రీ కూర్మనాధ క్షేత్రంలో తెప్పోత్సవ కార్యక్రమం

SKLM: గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాధ క్షేత్రంలో ఆదివారం తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహా నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే పాస్ ఉన్నవారికి మాత్రమే తెప్పపైకి అనుమతించనున్నట్లు స్థానిక ఎస్సై గంగరాజు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.