ఆటో కొనివ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్య
NDL: బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రామాంజనేయులు(30) ఆత్మహత్య చేసుకుని, మృతిచెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈయన కొంతకాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లలేదు. ఆటో నడుపుతానని, కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. మద్యం మానితే కొనిస్తామని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో 2న కల్లూరు(M) పందిపాడు సమీపంలో పురుగుమందు తాగాడు.