పొన్నూరు భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరం
GNTR: పొన్నూరు భవిత కేంద్రంలో మంగళవారం ప్రత్యేక ఫిజియోథెరపీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవడం ద్వారా అంగవైకల్యం తగ్గుతుందని సూచించారు. అనంతరం ఆమె చిన్నారుల తల్లిదండ్రులకు చికిత్స విధానాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు విజయ కుమారి పాల్గొన్నారు.