VIDEO: నీటిని విడుదల చేయాలని కోరిన మాజీ ఎంపీ

VIDEO: నీటిని విడుదల చేయాలని కోరిన మాజీ ఎంపీ

MHBD: గూడూరు మండల పరిధిలోని గోవిందాపురం, లక్ష్మీపురం, దుబ్బగూడెం, కట్టుగూడెం, రెడ్యాల గ్రామాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని రైతులు మాజీ ఎంపీ మాలోత్ కవిత దృష్టికి తీసుకెళ్లడంతో సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు.