ప్రమాదాల తగ్గింపులో నిబంధనలు కీలకం: SP

ప్రమాదాల తగ్గింపులో నిబంధనలు కీలకం: SP

MDK: రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ‘Arrive Alive’ మూడో విడత కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన నిర్వహించారు. విద్యార్థులకు, యువతకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.