ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

SKLM: లావేరు శాఖా గ్రంధాలయంలో శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత సీనియర్ సిటిజన్ వీరభద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుల జీవిత చరిత్రలు గురించి విద్యార్థులకు తెలియజేశారు. వ్యాసరచన, క్విజ్, పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గ్రంధాలయాధికారి మురపాక శ్రీనివాసరావు గ్రంథాలయము తరుపున బహుమతుల అందజేశారు.