కల్లుదేవకుంటలో ఇసుక ట్రాక్టర్ ప్రమాదం
KRNL: మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లుదేవకుంట గ్రామ సమీపంలో శనివారం అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. ట్రాక్టర్ ఇంజన్ ధ్వంసం కాగా సాగునీటి సంఘం ఛైర్మన్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. సుమారు రూ.2 లక్షల నష్టం వచ్చిందని తెలిపారు. రోడ్డుపై బోల్తా పడిన ట్రాక్టర్‌ను జేసీబీ సాయంతో వాహనాన్ని పక్కకు తరలించారు.