రైస్ మిల్లులో తూనికలు కొలతల అధికారుల తనిఖీ

రైస్ మిల్లులో తూనికలు కొలతల అధికారుల తనిఖీ

NLG: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పరిధిలోని మహా తేజ రైస్ మిల్లులో గురువారం జిల్లా తూనికల కొలతల అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో వే బ్రిడ్జిని తనిఖీ చేసి రైతుల ధాన్యం కొలతలను పరిశీలించారు. వే బ్రిడ్జిలో పది టన్నుల ధాన్యంకు 40 కిలోలు తేడా వస్తుండడంతో గుర్తించి వే బ్రిడ్జీని సీజ్ చేశారు.