నేడు తెనాలి రానున్న పవన్ కళ్యాణ్

GNTR: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు తెనాలి రానున్నారు. సాయంత్రం 4గంటలకు సుల్తానాబాద్‌లోని హెలిప్యాడ్ వద్ద దిగనున్న ఆయన, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే వారాహీ వాహనం ద్వారా చెంచుపేట మీదుగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ తెనాలి మార్కెట్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ సుమారు 6గంటలకు బహిరంగ సభ ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మనోహర్ తెలిపారు.