రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుంది: హరీష్ రావు
TG: కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీడియో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు కుప్పలుగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల అధికారి చర్యలు తీసుకుంటామన్నారని అన్నారు. సీఎం రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుని ఇవాళ 6 గ్యారెంటీలపై రివ్యూ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.