విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

MHBD: మరిపెడ మండలం ఎల్లంపేటలో మంగళవారం రాత్రి విషాదం నెలకొంది. బత్తెం అజయ్ (21) అనే యువకుడు ఇంట్లో ఎల్లమ్మ పండగ ఉత్సవాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో సరిచేస్తుండగా షాక్‌ తగిలి మృతి చెందాడు. చేతికి అందిన కొడుకు విద్యుత్ షాక్‌తో మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.