పేకాట ఆడుతున్న తొమ్మిది మందిపై కేసు నమోదు
VZM: ఎస్.కోట పట్టణ పోలీసులకు కాపు సోంపురం గ్రామ శివారు మామిడితోటలో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం ఇవాళ సిబ్బందితో దాడులు నిర్వహించారు. దాడుల్లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, వారివ్వద్ద నుంచి రూ.10350 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఆనంతరం వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు.