కాజీపేటలో పది విద్యుత్ మోటర్లు చోరీ

కాజీపేటలో పది విద్యుత్ మోటర్లు చోరీ

WGL: కాజీపేట సోమిడి శివారులో దొంగల బెడద మళ్లీ తలెత్తింది. వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటర్లు, తీగలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. భాదితులు తెలిపిన వివరాలు.. కాయిత జంపయ్య, జాగం రాజకుమార్, శ్రీను, మొగిలి తదితర రైతులకు చెందిన పది విద్యుత్ మోటర్లు చోరీకి గురయ్యాయని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.