5 వ రోజుకు చేరిన భూ నిర్వాసితులు దీక్ష
MBNR: జడ్చర్ల మండలం పోలేపల్లిలో భూ నిర్వాసితులు చేస్తున్న నిరాహార దీక్ష సోమవారం ఐదో రోజుకు చేరింది. బీఆర్ఎస్ నాయకుడు కర్నే కోట పర్వత్ లాల్ మాట్లాడుతూ.. నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, పరిశ్రమల్లో పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.