అన్న క్యాంటీన్‌లో పరిశుభ్రత పాటించాలి: కమిషనర్

GNTR: తెనాలి పట్టణంలోని అన్న క్యాంటీన్‌లను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి గురువారం సందర్శించారు. ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని క్యాంటీన్‌కు వెళ్లిన ఆయన, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు.