VIDEO: మనోజ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
NLR: జులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మనోజ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వివరాలు వెల్లడించారు. మృతుడు మనోజ్ పై దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. అతని స్నేహితుడు హరి ప్రసాద్ భార్య గురించి తప్పుగా మాట్లాడడం హత్యకు కారణమైందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.