ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మేడే వేడుకలు

MNCL: జన్నారం మండల కేంద్రంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం రోజున ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని హమాలి సంఘం ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రధాన రహదారి మీదుగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.