ట్రాలీ ఆటో ఢీకొని 16 నెలల బాలుడి మృతి

జగిత్యాల: కోరుట్ల పట్టణంలో తాగునీటి సరఫరా చేసే ట్రాలీ ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిసింద్ర, అపూర్వ దంపతుల కుమారుడైన సుధన్వన్ ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ అజాగ్రత్తతో నడిపి బాలుడిని ఢీకొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.