VIDEO: యర్రగొండపాలెంలో రహదారిపై కార్లు అడ్డం పెట్టి ధర్నా

ప్రకాశం: యర్రగొండపాలెంలో కార్ డ్రైవర్లు బుధవారం నిరసన చేపట్టారు. కార్ పార్కింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని తమకు స్థలం కేటాయించాలంటూ MRO కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో తహసీల్దార్ లేకపోవడంతో కార్ డ్రైవర్లందరూ జాతీయ రహదారిపై కార్లు అడ్డం పెట్టి ధర్నా చేశారు.