ర్యాలీ కేశవ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు

ర్యాలీ కేశవ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలీ వేంచేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.