మండల స్థాయి FLN - TLM కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం

SRPT: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన, అభ్యసన సామాగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర్థవంతంగా బోధన అర్థమవుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి FLN-TLM మేళా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.