రేపు తిరుపతిలో రాష్ట్రపతి పర్యటన
AP: తిరుపతిలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.25కి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం వరాహస్వామిని, తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తర్వాత తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.