VIDEO: ఇళ్లు కూల్చివేత.. బాధితుడికి అండగా జనసేన
కృష్ణా: మచిలీపట్నం కొబ్బరితోటలో మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఇంటిని కూల్చి వేసిన విషయం తెలిసిందే. అయితే గృహ నిర్మాణదారుడు శ్రీపతి వెంకటాచలం కుటుంబాన్ని నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బండి రామకృష్ణ పరామర్శించారు. వివాదాల్లో ఉండటంతోనే మున్సిపల్ అధికారులు కూల్చివేశారన్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో చర్చించి బాధితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.