ఆర్టీఏ ఏజెంట్లు అలర్ట్.. షట్టర్లకు తాళాలు

ఆర్టీఏ ఏజెంట్లు అలర్ట్.. షట్టర్లకు తాళాలు

WGL: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల వార్తలతో వరంగల్ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల్లో ఏజెంట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఏసీబీ అధికారులు తనిఖీలకు వస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగడంతో ఏజెంట్లు షాపుల షట్టర్లకు తాళాలు వేసి ఎక్కడివారక్కడ సైలెంట్ అయ్యారు. ఆర్టీఏ అధికారులతో పాటు ఏజెంట్లు, హోంగార్డులు అక్రమాలకు పాల్పడుతున్నారని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి.