ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే
VZM: తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. బుధవారం జామి మండలం జట్టేడివలస గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో ఆమె పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఆమెకు గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు.