ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.