'మహాసభపై దృష్టి సారించండి'
విశాఖ మద్దిలపాలెం రామ్మోహన్ భవన్లో యన్ఎంయూఏ జిల్లా రీజినల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి పి.వి.వి. మోహన్ మాట్లాడుతూ.. 12వ తేదీ విజయవాడలో జరిగే రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల పాస్‌లపై ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను వివరించారు. స్టీల్ సిటీ డిపో కొనసాగింపుకు మద్దతు తెలిపారు.